జ్యోతి రావు ఫూలేకు ఘననివాళులు

తాడేపల్లిగూడెం: బహుజనుల ఆత్మగౌరవ పతాక మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి సందర్భంగా స్థానిక నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవబట్ల విజయ్ ఆధ్వర్యంలో ఫూలే సర్కిల్ లో ఉన్న జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద జయంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ హజరుఅయ్యారు. నియోజకవర్గ అధ్యక్షులు కేశవబట్ల విజయ్ మాట్లడుతూ అణచివేతకు గురి అయిన అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు పులే అని, శూద్రులు వెనుకబాటుకు కారణం విద్య లేకపోవడమే అని గ్రహించి విద్యా వ్యాప్తికి కృషించేసిన మహనీయుడు పులే అని అన్నారు. మనుస్మృతి రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో మహిళలను మనిషిగానే పరిగణించే వారు కాదు అని జ్యోతిరావు పులే పోరాటం చేసి మహిళలకు విద్యా ప్రాధాన్యతను వివరించి తన భార్య అయిన సావిత్రి బాయి పులేని చదివించి సావిత్రి భాయి ఫూలే ద్వారా 1848 లోనే దేశంలోనే మొట్ట మొదటి మహిళా పాఠశాల నెలకొల్పిన సాంఘ సంస్కర్త ఫూలే అని, అంతే కాకుండా శుద్రుల కోసం మరియు దళితులు కోసం విద్యాలయలు నెలకొల్పిన మొదటి మహనీయుడు పులే అని, ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి మహిళ విద్యను అభ్యసిస్తున్నారు అంటే అందుకు కారణం ఫూలే అని పేర్కొన్నారు.