శ్రీకాళహస్తి ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి – శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా మంగళవారం తొట్టంబేడు మండలం, పొయ్య, పొయ్య కొత్తూరు, చిన్న సింగమల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని, పార్లమెంట్ ఎంపీ స్థానానికి బీజేపీకి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన తొట్టంబేడు మండల అధ్యక్షులు పేట చంద్ర శేఖర్, జనసేన – టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.