అనకాపల్లి నియోజకవర్గ 31 పంచాయతీలకు గ్రామకమిటీలు నియమించి 513 మంది జనసైనికులకు నియమాక పత్రాలు అందజేత

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి పరుచూరి భాస్కరరావు అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలంలో గల సుమారు 31 పంచాయతీలకు మరియు గ్రామాలకు గ్రామకమిటీలు నియమించి 513 మంది జనసైనికులకు నియమాక పత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా హాజరైన జనసైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ త్వరలో చేపట్టబోయే క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జనసైనికులు అందరూ సోషల్ మీడియాలోనే కాకుండా గ్రామ స్థాయిలో జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మార్చి 14న జరగబోయే పార్టీ ఆవిర్భావ సభకు అనకాపల్లి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తరలివెళ్లాలని కోరారు. త్వరలో మండలంలోని ప్రతి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనునట్లు తెలియజేసారు, అలాగే త్వరలో నియోజకవర్గంలో చేపట్టబోయే గ్రామ స్థాయి పర్యటనలకి జనసైనికులు అందరూ సన్నద్ధం అవ్వాలని కోరారు. ప్రతి గ్రామ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యి త్వరలో చేపట్టబోయే మండల కమిటీకి సంబందించి వారి నుండి తగు సూచనలు తీస్కున్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండలం ముఖ్య నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.