ప్రముఖ గాయని సునీత పేరుతో రూ.1.7 కోట్లు వసూలు

ప్రముఖ సింగర్ సునీత పేరు చెప్పుకొని కొందరు చేసిన మోసాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 1.7 కోట్లు వసూల్ చేసి టోకరా ఇచ్చారు. ఇప్పటికే తాను సునీత మేనల్లుడినని చెప్పుకుంటున్న చైతన్య అనే వ్యక్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతను చేసిన ఘరానా మోసం ఒకటి బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.

కొత్తపేటకు చెందిన ఓ మహిళ కు చైతన్య మయ మాటలు చెప్పి… కేరళలో ‘ఆనంద చేర్లాయం ట్రస్ట్‌’లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో బాధితురాలు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది. అలాగే అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి పలు దఫాలుగా రూ.1.7 కోట్లు బాధితురాలి నుండి వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫొటోలు వాట్సాప్‌లో పంపించే వారు కానీ ఎప్పుడూ వీడియో కాల్‌ మాట్లాడేవారు కాదు. ఎన్నో మార్లు అడిగిన అనంతరం అనుమానం వచ్చి గాయని వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చిన చైతన్య మీద ఆమె చీటింగ్ కేసు పెట్టింది.