అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
గంగాధర నెల్లూరు, కార్వేటి నగరం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ముఖ్య అతిధిగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జి మాట్లాడుతూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో అందరి ఆయుష్షును పోసుకొని నిండు నూరేళ్లు దీర్ఘాయుష్షుగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము అన్నారు. అదేవిధంగా 2024లో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని వుద్ఘాటించారు. రాబోవు రాజ్యం రామరాజ్యం అని, ప్రజలకు మంచి చేయుటకు దేవుడు సృష్టించిన మానవతామూర్తి పవన్ కళ్యాణ్ కొనియాడారు. తర్వాత పార్టీ మండల నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేసి, పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, హర్షద్వానాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, మాదాసి వెంకటేష్, విజయ్, కార్యదర్శులు మురళి, ప్రతాప్, గంగయ్య, నాదముని, నాగార్జున, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు మహేంద్ర,మండల యువజన అధ్యక్షులు నరసింహులు, మండల వీర మహిళ విభాగం అధ్యక్షురాలు సెల్వి, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మహేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఎస్ఆర్ పురం మండల సంయుక్త కార్యదర్శి మని, జనసైనికులు కిషోర్, మాస్టర్ రాజేష్ పాల్గొన్నారు.