యూకె జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 11 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

యూకె, యూకె జనసేన ఆధ్వర్యంలో శనివారం మార్చ్ 9 లండన్ లో మాంచెస్టర్ మరియు ఆదివారం మార్చ్ 10న బర్మింగ్ హామ్ నగరాలలో మీతోనే అనే కార్యక్రమం ద్వారా జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మేము అందరం ఎప్పుడు మీతోనే అన్నయ్యా అంటూ నినాదాలు చేస్తూ చక్కగా సెలెబ్రేట్ చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొని జనసేనకి సపోర్ట్ చెయ్యటం జరిగింది. ఇదే విధంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని భావి తరాల వాళ్ళు కూడా వైభవంగా జరుపుకొనేలా పార్టీని బలోపితం చేసుకొంటూ ముందుకు తీసుకు వెళ్ళాలని అన్నారు. మరియు ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం ద్వారా పార్టీకి సపోర్ట్ గా నిలవాలి అని చెప్పటం జరిగింది. ఎన్నారై ఎన్నికల యాత్ర అనే కార్యక్రమం కూడా ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నారైలు అందరు వారి నియోజకవర్గానికి వచ్చి అందరి చేత ఓట్ వేయించే విధంగా కృషి చేసి 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ జనసేనకి తోడుగా ఉంటూ జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిని విజయవంతంగా గెలిపించాలి అని కోరటం జరిగింది. ఈ 2024 ఎన్నికలకి నలుమూలల ఉన్న తెలుగు ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చి అందరి చేత జనసేన-టీడీపీ-బీజేపీ కూటమికి ఓట్ వేయిచి ఈ రాక్షస పాలననుంచి ఆంధ్రప్రదేశ్ కి విముక్తి తీసుకు వచ్చేలా కృషి చేయాలి అని జనసైనికులు మరియు వీరమహిళలు వారి భావాలను పంచుకవటం జరిగింది. జనసేన నాయకులు మరియు దర్శకులు అయిన మెహర్ రమేష్, ఎన్నారై ఎస్.ఏ.వి.వి.ఈ కో-ఆర్డినేటర్ శశిధర్ కొలికొండ జూమ్ ద్వారా పాల్గొని ప్రజలను ప్రభావితం చేసి గెలిచే విధంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నా సేనకోసం నా వంతుకి రూపాయలు 2 లక్షలు సమీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.