అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి

*ముఖ్యఅతిథిగా విచ్చేసిన వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్.సి-3 జి. కృష్ణంరాజు

విజయనగరం: వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 గవర్నర్ పి.జి. గుప్తా పిలుపు మేరకు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు)ఆధ్వర్యంలో మన్యం వీరుడు,స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని నిర్వహించడం జరిగింది.

సోమవారం ఉదయం దాసన్నపేట రైతు బజారు జంక్షన్ వద్ద, శ్రీ అల్లూరి సీతారామరాజు సేవాసంస్థ నెలకొల్పిన సీతారామరాజు విగ్రహానికి, కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్-3 వాకర్ జి. కృష్ణంరాజు మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఛైర్పర్సన్ వాకర్ ఐ. రామరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అతిధిగా విచ్చేసిన జి.కృష్ణంరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశభక్తికి, ధైర్యశాహశాలకు ప్రతీక అని, తెల్లదోరలకు కునుకులేకుండా చేసి, అమాయకపు గిరిజనల్లో చైతన్య స్ఫూర్తిని నింపిన విప్లవజ్యోతి అని కొనియాడారు.

కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు లోపింటి కళ్యాణ్, కార్యదర్శి కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ ఎస్. మురళీమోహన్, చెల్లూరి ముత్యాల నాయుడు, సభ్యులు మిడతాన రవికుమార్, దువ్వి రాము, ముక్కి కుమార్ తదితరులు పాల్గొన్నారు.