లావేరు మండలంలో వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు

లావేరు మండలం: రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటుచేసిన మహోన్నత వ్యక్తి.. జైలు గోడల మధ్య నిలబడి శాసనసభ్యుడిగా గెలిచిన జననేత.. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వెనుకబడిన తరగతుల అభ్యున్నత కోసం పాటుపడిన కాపుకుల ప్రత్యక్ష దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి సందర్భంగా.. ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ తరపున సోమవారం లావేరు మండలంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి.. పూలదండను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గము, జి సిగడం మండలం జనసేన పార్టీ నాయకులు తాలబత్తుల పైడిరాజు, దన్నాన సంతోష్, పట్నాన సూర్యారావు,
లావేరు నాయకులు ఇజ్జు శ్రీనివాస్, కోల రాజేష్, రాజా రమేష్, స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.