జనంతో జనసేన కార్యక్రమం గంగంపేట గ్రామంలో 12వ రోజు

ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్ ఎంపిటిసి ఆధ్వర్యంలో జనంతో_జనసేన కార్యక్రమంలో భాగముగా 12వ రోజు, గంగంపేట గ్రామంలో ప్రధాన సమస్య, మంచి నీటి బోరింగ్ పక్కన, డంపింగ్ చేయడం అదే విదంగా ఉన్న కాలువలు సరిగ్గా ఉపయోగించే విధానం రాకపోవడం. దీనిపై పంచాయతీ దృష్టి పెట్టాలి అని చెప్పడమే కాకుండా ఓట్లు వేసేటప్పుడు కాకుండా, ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి మరియు గ్రామ అభివృద్ధికి కూడా ఇతర పార్టీలు ముందు ఉండాలని అదే విదంగా ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందిని జనసేన పార్టీ తరుపున మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీను, రమేష్, సంతోష్ నాయుడు, ప్రసాద్, కోమల్, జగదీశ్, అలానే గ్రామ నాయకులు ధనుంజయ్ అలానే పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.