జనసేన భీమ్ యాత్ర 13వ రోజు

కాకినాడ సిటి: జనసేన పార్టీ జగన్నాధపురంలోని కుంతీడేవీపేట ప్రాంతంలో బోడపాటి మరియా ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జనసేన భీమ్ యాత్ర నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక దళితులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలని సేకరిస్తూ ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న నిస్సిగ్గు రాజకీయాన్ని విశదీకరిస్తూ స్థానిక పేద ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం నిర్వహించారు. దళితులు తమ ఆరాధ్య దైవంలా అంబేడ్కర్ గారిని భావిస్తారని, అలాంటి అంబేడ్కర్ పేరుతో విదేశీ విద్య అన్న పధకాన్ని పేరు మార్చి ఈముఖ్యమంత్రి పేరు పెట్టుకోడం చూస్తే బాబాసాహెబ్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని భావిస్తున్నట్టా అని విస్మయం చెందేలా ఉందన్నారు. ఇది కేవలం వై.సి.పి ప్రభుత్వం ఆయనని అవమానించేలా చేసిన క్షమించలేని చర్యగా భావిస్తున్నామని ఇలాంటి చేష్టలని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందనీ తమ పార్టీ అంబేడ్కర్, జగజ్జీవన్ రాం లాంటి మహాత్ములని గౌరవించుకుంటూ కాన్షీరాం, మాయావతిలాంటి వారి యందు ఆరాధనాభావం కనపరుస్తామన్నారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, బోడపాటి మరియా బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి తదితరులు పాల్గొన్నారు.