పవన్ ఆశయాలను కొనసాగించడమే మన లక్ష్యం: బొర్రా

సత్తెనపల్లి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి జనసైనికుడు, వీర మహిళ పనిచేయాలని జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. సత్తెనపల్లి పట్టణం జనసేన కార్యాలయంలో జరిగే నియోజకవర్గ విస్తృత స్థాయి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏది చెప్పిన చేయటానికి ప్రతి జనసైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోత్తయిన మరేదైనా అంశమైన ఆయన అడుగుజాడల్లో నడవాలని, అనుసరించాలని హితవు పలికారు. జనసేన పార్టీ ఒక కులాలు మతానికో వర్గానికి సంబంధించింది కాదని, బడుగు బలహీన వర్గాలు ముస్లింలు ఎస్సీ ఎస్టీల తరుపున ప్రశ్నించే గొంతుక అవుతుందన్నారు. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఉంటుందన్నారు. గ్రామ గ్రామానికి పవన్ కళ్యాణ్ కార్యాచరణను వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలన్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న అన్ని వర్గాల వారు అన్ని మతాలవారు, అన్ని ప్రాంతాలవారు విశ్వసించాలి అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా ప్రతి జనసైనికుడు పరిచయాలన్నారు. ఈ సమావేశం అనంతరం బృగుబండ అధ్యక్షులుగా గుంజి నాగరాజు, ఉపాధ్యక్షులుగా ఇంకొల్లు గురువిష్ణు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జనసేన కార్యకర్త రఫీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు బొర్రా. ఈ సమావేశంలోఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, మున్సిపల్ కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, ముప్పాళ్ళ మండల ప్రెసిడెంట్ సిరిగిరి పవన్ కుమార్, రూరల్ మండల్ ప్రెసిడెంట్ నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం మండలం ప్రెసిడెంట్ తోట నరసయ్య, నకరికల్లు మండల ప్రెసిడెంట్ తాడువాయి లక్ష్మి, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు భక్తుల కేశవ, జనసైనికులు దార్ల శ్రీనివాస్, అంపిరాయన్ రాజశేఖర్, సీనియర్ కాపు సంఘ నాయకులు కడియం అంకమ్మరావు, వీర మహిళలు గట్టు శ్రీదేవి నామాల పుష్పలత తదితరులు పాల్గొన్నారు.