జన చైతన్య శంఖారావం 20వ రోజు

ధవళేశ్వరం గ్రామంలో కెనాల్ రోడ్డు ఎంప్లాయిస్ కాలనీలో 20వ రోజు జన చైతన్య శంఖారావం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన దుర్గేష్ కాలనీలో సమస్యల గురించి కాలనీ వాసుల్ని అడగడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ మరీ అధ్వానంగా ఉంది ఎంప్లాయిస్ కాలనీ అయినా మాకు ఈ ప్రాంతంలో ఎన్ని సార్లు చెప్పినా సరే రోడ్డు పక్కన డ్రైనేజీ గాని డంపింగ్ యార్డ్ గురించి గానీ పట్టించుకునే వారే లేరని చెప్పడం జరిగింది. అందుకు దుర్గేష్ మీ ఈ ప్రాంతమే కాదు మొత్తం ధవళేశ్వరం అంతా కూడా శానిటైజేషన్ వ్యవస్థ అద్వానంగా ఉంది. దానివల్ల ఇళ్లల్లోకి విపరీతమైన దోమలు వచ్చేస్తున్నాయి అంతేకాకుండా డంపింగ్ యార్డ్ లేని చోట ఒకే చోట కుప్పగా పెరిగిపోయిన చెత్త వల్ల పందులు రోడ్లమీద తిరుగుతున్నాయని చెప్పడం జరిగింది. దీనివల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పడం జరిగింది. దుర్గేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని రానున్న రోజుల్లో మీ సమస్యలన్నీ అతి తొందరలోనే నేనే తీరుస్తానని చెప్పారు. కాలనీవాసులు ఇక్కడ వేసిన రోడ్లు చాలా మట్టుకు మీరు వేసినవని దుర్గేష్ కి చెప్పడం జరిగింది. అందుకు ఈ కాలనీలో ఉన్న శిలాఫలకాలే సాక్ష్యమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటి శ్రీను, క్రాంతిక, సత్యనారాయణ మూర్తి మాస్టర్, సూర్య గౌతమ్, మువ్వా గౌతం, రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్పా చిన్నారావు, జిల్లా కార్యదర్శి బీర ప్రకాష్, దూది సాయి, సురాడ సత్తిబాబు, మేక సత్యనారాయణ, వర్రె రమేష్, మట్టపర్తి నాగరాజు, ఆటో బుజ్జి, సులేమాన్, శివ, లోకేష్, వేమగిరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి రాజేష్, జంగా వినోద్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *