ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 20వ రోజు పాదయాత్ర

ఏలూరు, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా గురువారం స్థానిక 6వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 లో రెడ్డి అప్పల నాయుడు పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ… 2005 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇళ్ళలో ఉన్న కాలనీ వాసులకు 17 సంవత్సరాలుగా మౌళిక వసతులకు కరువై ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయమని రెడ్డి అప్పల నాయుడు ఎద్దేవా చేశారు. కేవలం ఓటు బ్యాంకుకీ తప్ప ఎటువంటి అభివృద్ధి నోచుకోలేని గత 17 సంవత్సరాలుగా చరిత్ర స్థాయిలో నిలిచిపోతారని దానికి ప్రధాన కారకులు ఇప్పుడున్న ప్రతిపక్షం, అధికార పక్షం వాళ్ళే అని రెడ్డి అప్పల నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో మంచినీటి సదుపాయం సరిగా లేదని స్థానిక ప్రజలు రెడ్డి అప్పల నాయుడుకి తెలియపరచగా సుమారు 25000 రూపాయలు వెచ్చించి ఆ ప్రాంత వాసులకు మంచినీటి బావిని తవ్వించి కాలనీ వాసుల దాహార్తిని తీర్చిన రెడ్డి అప్పల నాయుడు. ఇప్పుడు కనీసం తాగడానికి మంచినీటి సదుపాయం కూడా కల్పించలేని ప్రభుత్వాలు దేనికి ఉన్నట్టు అని ప్రశ్నించారు. ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ళ నానికి ఇక్కడ ఉన్న కాలనీ వాసుల సమస్యలు కనిపించవా? సరైన రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం లేక చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. తక్షణమే శాసనసభ్యులు ఆళ్ళ నాని మరియు నగర మేయర్ నూర్జహాన్ ఈ కాలనీ సమస్యలపై దృష్టి సారించాలని మౌళిక సదుపాయాలు కల్పించి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, మండల ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, యూత్ వైస్ ప్రెసిడెంట్ జనపరెడ్డి తేజ ప్రవీణ్, స్థానిక నాయకులు పొన్నూరు రాము, బొద్దపు గోవిందు, బుద్ధా నాగేశ్వరరావు, దోసపర్తి రాజు, దుర్గారావు, రేయి నూకరాజు, సతీష్, పి.రాజు, ప్రకాష్, శేఖర్, గణపతి, అజయ్, జిల్లా నాయకులు, వీర మహిళలు లంకా ప్రభావతి, సరళ, సుజాత, ఉమా దుర్గా తదితరులు పాల్గొన్నారు.