అవినీతి కోరల్లో కూరుకుపోతున్న ఏలూరు కార్పోరేషన్ – రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్లో తారాస్థాయిలో అవినీతి పెరుగుతుంది అనడానికి అధికార పార్టీకి సంబంధించిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోలి శరత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఇతర డిపార్ట్మెంట్లకు కూడా లేఖ రాయడం జరిగింది. ఇదే విధంగా గతంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 30వ డివిజన్ కార్పోరేటర్ ప్రభుత్వానికి ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని రాష్ట్ర ముఖ్యమంత్రికీ తెలియపరిచారు. ఏలూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్న ఆళ్ళ నాని కనీసం నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు లేవు. సొంత పార్టీ నాయకులు అవినీతి మీద గొంతు ఎత్తుతుంటే శాసనసభ్యుల నుండి స్పందన కరువైందని రెడ్డి అప్పల నాయుడు విమర్శించారు. 38 నెలలుగా ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి నేడు గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని పబ్లిసిటీకే పరిమితమైన ఆళ్ళనాని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎవరికైనా సమస్య ఉందని అడగడానికి వస్తుంటే వాలంటీర్లు ద్వారా వాళ్ళని ప్రక్కకు నెట్టివేసి ప్రభుత్వం గురించి మంచిగా చెప్పే వాళ్ళను అది కూడా వైసీపీ కార్యకర్తలనే నిలబెట్టి పొగడ్తలు పొగిడించుకుంటున్న శాసనసభ్యులు అని రెడ్డి అప్పల నాయుడు ఎద్దేవా చేశారు. ఇకనైనా ఏలూరు కార్పోరేషన్లో జరుగుతున్న అవినీతి పై నోరు తెరిచి అవినీతిని అరికట్టాలని రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు బొత్స మధు, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, పార్టీ సీనియర్ నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, నాయకులు కందుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.