24వ రోజు జన జాగృతి యాత్ర

  • పశ్చిమ గానుగూడెం గ్రామంలో జన జాగృతి యాత్రకు విశేష స్పందన
  • దళితవాడలో రెపరెపలాడిన జనసేన జెండా✊️
  • జనసెన పార్టీ ఇంచార్జి మేడా గురుదత్తకు జనసైనికుల బ్రాహ్మరధం

రాజానగరం, కోరుకొండ మండలం, పశ్చిమ గానుగూడెం గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన 24 వ రోజు జన జాగృతి యాత్రకు విశేష స్పందన లభించింది.ధిఈ కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గం జనసేన ఇంచార్జి మేడా గురుదత్త ప్రసాద్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో వున్న జనసైనికులు బైక్ ర్యాలీ నిర్వహించి రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ గురుదత్త ప్రసాద్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవికి ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జనసైనికులు ఉత్సహంతో హాజరైయి ఆయన నాయకత్వం బలపరుస్తూ బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా ఆగ్రామానికి చెందిన జనసేన పార్టీ ప్రెసిడెంట్ రచ్చపోతుల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో నియోజకవర్గ ఇన్చార్జ్ గురుదత్త ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని విమర్శించారు. జనసేనాని పవన్ నిజాయితీ కలిగిన నాయకుడని అన్నారు. జనసేన ఆదరణ చూసి వైస్సార్సీపీ విశాఖపట్నంలో అక్కసు వెళ్ళగక్కారని ధ్వజమెత్తారు. ఈప్రభుత్వంలో అభివృద్ధి లేదని విమర్శించారు. సేవభావం ఉన్న పవన్ కి ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిస్వార్ధపరుడు పవన్ అని తెలిపారు. నిస్వార్ధ సేవలు అందిస్తున్నారని ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి రానున్న రోజుల్లో జనసేన జెండా ఎగరేసే విధంగా విజయాన్ని చేకూర్చాలని కోరారు. జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ, నిజాయితీ సేవాభావం కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆయన నాయకత్వం బలపర్చి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల కన్వీనర్ మండపాక శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి వీరపురాజు పోసిబాబు, ఎంపిటిసి అభ్యర్థి గోళ్ళ సాయి, గ్రామ సెక్రటరీ బొజ్జంకి రాజు, గ్రామ కమిటీ సభ్యులు గోళ్ళ కృష్ణ, గోళ్ళ గోవింద్, చోంగా పవన్, బత్తిన రాజబాబు, ఎడ్ల రామకృష్ణ, ఎడ్ల బాను, కాండ్రగుల మణికంఠ, సంతోష్, సతీష్, మండపురెడ్డి ప్రసాద్, గేడ్డం మనోహర్,నాయుడు కిషోర్, తూము వీరబాబు, దాసరి గోపి, కాశీ, కోమలి వీరబాబు, ముద్రగడ శ్రీనివాస్, కాండ్రేగుల శ్రీను, కోచర్ల భారత్, నాళం దుర్గాప్రసాద్, నంబక్తుల రాజేష్, జనసేన నాయకులు చదువు ముత్తేశ్వరరావు, కొచ్చర్ల బాబీ, అడపా అంజి, తన్నీరు తాతాజీ, అరుబోలు బాలు, తెలగంశెట్టి శివరామకృష్ణ, అడబాల హరి, ఆకుల ఆదిత్య, తోరటి దుర్గా ప్రసాద్, మండపాక మురళీకృష్ణ, వీరబాబు, వెలుగుబంద కోరుకొండ మండలం సోషల్ మీడియా ప్రతినిధి పెమ్మాడ సతీష్ కుమార్, వందలాదిగా గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.