48వ రోజు కొనసాగిన మహిళలతో మాటామంతి

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 48వ రోజు శనివారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 42వ డివిజన్ లో పర్యటించి మహిళలతో మమేకమై డివిజన్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అవినీతి అక్రమ పాలన అంతమయ్యేందుకు రోజులు దగ్గర పడ్డాయని జగన్ పాలనపై అన్ని వర్గాలు విసిగిపోయాయని ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీలను ఆశీర్వదించాలని రాష్టానికి అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత బిజెపి కేంద్ర ప్రభుత్వ సహకారంతో జనసేన-తెలుగుదేశం పార్టీలు బాధ్యత తీసుకుంటాయని అంటూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలోని ప్రధానమైన విషయాలను ప్రజలకు వివరించారు వీటితో పాటు స్థానిక డివిజన్ లో మంచినీటి సమస్య, మురుగుకాలువల సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.