వైద్యం వికటించి 5 సంవత్సరాల బాలుడు మృతి

  • బాలుడు తల్లిదండ్రులు పరామర్శించిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండలో టైర్లు పంచర్ షాప్ వృత్తి చేసుకుంటున్న ఎస్ కే బాషా తన కుమారుడు (ఎస్ కె రాహీల్) కు శుక్రవారం రాత్రి కడుపులో నొప్పి అనగా శనివారం ఉదయం కందుకూరు రోడ్ లోని న్యూ రెయిన్బో హాస్పిటల్ కి ఎస్ కే రాహిల్ ను తీసుకునిరాగ హాస్పిటల్ లో డాక్టర్ ఎస్ కే రాహిల్ కు ఇంజక్షన్ వేసి టాబ్లెట్లు ఇవ్వడం జరిగింది, కొద్ది నిమిషాలలోనే ఆ చినబాబు నీరసం అయ్యి ఒల్లు చల్లబడటం గమనిచిన తల్లిదండ్రులు బాబును చూసి కంగారుపడి డాక్టర్ ని పిలిచి అడుగగా వెంటనే పెద్ద హాస్పిటల్ కు వెళ్ళమని చేపటం జరిగినది. న్యూ రెయిన్బో హాస్పిటల్ నుండి పెద్ద హాస్పిటల్ కు వెళ్దామని తీసుకొని వెళ్తుండగా ఆ చిన్నబాబు (ఎస్ కె రాహీల్) మార్గమధ్యంలో సుమారు పోలీస్ స్టేషన్ దాటే లోపే చనిపోవడం జరిగినదని తల్లిదండ్రులు తెలియజేసారు. ఈ ఘటన జరిగిన తరువాత డాక్టర్ ని వివరణ అడగటానికి వెళ్లగా హాస్పిటల్ మూసివేసి పారి పోవటం జరినిగినది. ఈ ఘటనను తెలుసుకొని ఆ బాబు (ఎస్ కే రాహిల్) తల్లిదండ్రులను పరామర్శించడానికి జనసేన పార్టీ నాయకులు ఎస్ కె భాషా వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పి అసలు విషయం తెలుసుకోగా ఆ తల్లిదండ్రులు జనసేన పార్టీ నాయకులతో ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన న్యూ రెయిన్బో హాస్పిటల్ డాక్టర్ పై కేసు నమోదు అయి 24 గంటలు అయినప్పటికీ నకిలీ డాక్టర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆ బాలుడు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడు తల్లిదండ్రులు మాట్లాడుతూ మాకు జరిగిన అన్యాయానికి మాకు న్యాయం జరగాలని తప్పుడు వైద్యం చేసిన నకిలీ డాక్టర్ ను ఈ ప్రభుత్వం శిక్షించాలి అని మాకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా మేము పోరాడుతామని బాలుడు తల్లిదండ్రులు వాపోతున్నారు. సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులు కుటుంబానికి అండగా ఉంటామని మండల అధ్యక్షులు అయినాబత్తిన రాజేష్ తెలిపారు. మీకు జరిగిన అన్యాయానికి మీకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని అయినాబత్తిన రాజేష్ అన్నారు. జనసేన పార్టీ నాయకులు సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నారు, 5 సంవత్సరాలు వయసు కలిగినటువంటి చిన్న బాలుడు తప్పుడు వైద్యం చేసి ప్రాణాలు తీసిన నకిలీ డాక్టర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వ వైద్య శాఖ సంబంధిత అధికారులు వచ్చి వారిపై చర్య ఎందుకు తీసుకోలేదు. ఇలాగ ఎన్ని ప్రాణాలు పోతే గాని మీరు కదులుతారు. ఇలాంటి నకిలీ డాక్టర్లు ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాల్లో ఉన్నారు వాళ్ళు ఇలాగే తప్పుడు వైద్యం చేసి ఎన్ని ప్రాణాలు తీసుకుంటారు, ఇలాంటి నకిలీ డాక్టర్ ల పై చర్యలు తీసుకోవాలని, మరో నిండు ప్రాణం బలికాకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేయటం జరిగినది. సీఐ లక్ష్మణ్ మరియు యసై సంపత్ కుమార్ పరారీలో ఉన్న నకిలీ డాక్టర్ ను వెంటనే అరెస్ట్ చేసి సోప సముద్రంలో మునిగి పొయి ఉన్న ఆ కుటుంబానికీ కొంత వరకైనా నాయం చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మృతి చెందిన బాలుడు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరఫున పోరాడుతామని కుటుంబానికి భరోసా తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినాబత్తిన రాజేష్, దండే ఆంజనేయులు, కాసుల శ్రీనివాస్, కాసుల శ్రీకాంత్, గుంటుపల్లి శ్రీనివాస్, అనుమల శెట్టి కిరణ్ బాబు, సంకే నాగరాజు, సయ్యద్ చాన్ భాషా, నటరాజ్, పసుమర్తి నాగేశ్వరావు, షేక్ సుల్తాన్ బాషా, షేక్ సుభాని, చలంచర్ల కరుణ్ కుమార్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.