వైసిపి నుంచి జనసేనలోకి 50 మంది చేరిక

నెల్లూరు: వైసీపీలో దళితులకు ప్రాధాన్యత లేదని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అరుంధతి వాడలోని మాతమ్మ దేవస్థానం వద్ద జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మార్పీఎస్ నాయకుడు వంగపూడి పెంచలయ్య అతని అనుచరులు సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మార్పీఎస్ నాయకుడు వంగపూడి పెంచలయ్య అతని అతని అనుచరుల మెడలో జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎస్సీ ఎస్టీ అక్కచెల్లలు అన్నతమ్ముళ్ళు అని చెప్పే సిఎం జగన్ మోహన్ రెడ్డికి దళితుల సమస్యల పై చిత్తశుద్ధి లేదన్నారు. అధికారంలోకి వచ్చాక దళితులకు అందే 27 పథకాలు రద్దు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనన్నార. ఒక దళితున్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు వత్తాసు పలుకుతూ దళితులకు ద్రోహం చేస్తున్నారన్నారు. అనంతరం వంగపూడి పెంచలయ్య మాట్లాడుతూ తాను ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల పైబడి తాము చేస్తున్న పోరాటానికి స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్.డి.ఏ కూటమికి బాసటగా నిలవాలని తన అనుచరుల్లో కొందరితో కలిసి నేడు జనసేన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. తాము జనసేన పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తూ మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు కుమార్, గోవిందు వినోద్, కంటిపల్లి పోలయ్య, పారి రామకృష్ణ, ఆలూరు హరి, చెవూరు వెంకట కృష్ణ, పవన్, కుబేష్, నరేంద్ర, పెంచలయ్య, మని, రాకేష్, దీపు, టీడీపీ నాయకులు మల్లి, వెంకటేష్, బీజేపీ నాయకులు దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.