ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం 61వ రోజు

మదనపల్లె నియోజకవర్గం, మదనపల్లి టౌన్ అనిబిసెంట్ సర్కిల్ నుండి బెంగళూరు రోడ్డు, చిప్పిలి ప్రాంతాల్లో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, నా సేనకోసం నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం 61 వ రోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది మరియు పారిశ్రామిక అభివృద్ధి లేదని తమిళనాడు అంటేనే అత్యధిక పరిశ్రమలు ఉన్న రాష్ట్రం, తెలంగాణ అంటే క్యాపిటల్ ఐటి, లైఫ్ సైన్సెస్, కర్ణాటక అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీలో 400 కంపెనీలు కర్ణాటకలోనే ఉన్నాయి, నీతి అయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ అంటే వాణిజ్య వ్యాపార కేంద్రం ఆన్ సోర్ ఆయిల్ రిఫైనరీ. మహారాష్ట్ర అంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్నది. ఇక్కడే ఆఫ్ సోర్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఇక్కడి నుండి జరుగుతుంది .బీహార్ అంటే పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. కానీ మన రాష్ట్ర పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ అంటేనే దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఐదవ స్థానం ఉంది తప్ప పరిశ్రమల్లో అధమ స్థానం కానీ దేశంలోనే అతి ధనవంతులైన ముఖ్యమంత్రి మాత్రం మొదటి స్థానంలో ఉన్నారు. రాష్ట్రాన్ని మాత్రం అందకారంలోకి నెట్టేసారని, ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇన్వెస్ట్ ఇండియా ప్రస్తావించింది. దేశంలో పారిశ్రామికంగా ఒక ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటే ఏపీ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకత గురించి ఏమి చెప్పాలో తెలియక అతి పెద్ద రాష్ట్రం అంటూ సరిపెట్టింది ,ఇది ఐదేళ్ల జగన్ పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్ పొందిన ప్రత్యేకత ఇది మన రాష్ట్రానికి లభించిన గుర్తింపు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ రామాంజనేయులు నా సేన కోసం నా వంతు కార్యవర్గ కమిటీ సభ్యులు శ్రీమతి దారం అనిత, మదనపల్లి పట్టణ అధ్యక్షులు జగదీష్ బాబు, మదనపల్లి జనసేన నాయకులు కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, ధరణి జనసేన సోను, షేక్ యాసిన్, అశ్వత్ గంగాధర, శ్రీనివాసులు, శ్రీనాధ్, గణేష్, సుప్రీమ్ హర్ష, నవాజ్, శేఖర, బహదూర్, వీర మహిళలు పద్మావతి, సురేఖ, ప్రభావతి, లక్ష్మి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.