సర్వేపల్లిలో 6వ రోజు జనంకోసం జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, ఈదగాలి పంచాయతీ, శ్రీకాంత్ కాలనీ నందు 6వ రోజు మంగళవారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో అట్టడుగును ఉన్న గిరిజనులు సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా శ్రీకాంత్ కాలనీకి అనుకొని రూ.కోట్ల రూపాయల విలువచేసే గ్రావెల్ ను అక్రమంగా తరలించి ఆ చుట్టుపక్కల 15 నుంచి 20 అడుగుల లోతు గుంటలో వర్షాలు వస్తే గుంటలన్ని నేలతో నిండిపోతే మూగజీవాలు అక్కడ ఆ గ్రామంలో నివసించే చిన్న పిల్లలు, వృద్ధులు ఆ గుంటలో పడి ప్రాణాలు కోల్పోయే దానికి అవకాశం ఉంది. దయచేసి కనీసం ఆ గుంటల చుట్టూ రక్షణ వలయం అన్న నిర్మించండి మహా ప్రభువు అని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ప్రభుత్వాధికారులని వేడుకున్నాం. మంత్రి అండదండలతో రూ.కోట్ల రూపాయల గ్రావెల్ మాఫీయా జరుగుతున్న పట్టించుకోని వైనం అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, రహీం, అక్బర్, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.