విజయవాడ జనసేన ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ, 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను 53వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తమ్మిన గురవమ్మ సత్రం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ జండా వందనం చేసిన అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందని, విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే గణతంత్ర దినోత్సవం అన్నారు. ఏపీలో వైయస్ జగన్ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటుంది అన్నారు. ఈ పాలనలో సంస్కృతి సాంప్రదాయాలు సర్వనాశనం అవుతున్నాయని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాలు ప్రదర్శించినంత మాత్రాన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నట్లు కాదని వాస్తవ కోణంలో గుడివాడలో సంస్కృతి సాంప్రదాయాలు సర్వనాశనం చేస్తూ క్యాసినోవా సెంటర్లో ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకొని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రేకపల్లి శ్రీను, తమ్మిన బాబి, మోహన్ రావు, స్టాలిన్, నల్లబెల్లి కనకారావు, ఉమామహేశ్వరరావు సోమశేఖర్, మదన్ కుమార్, శివ, రాము, రమణారెడ్డి, నూకరాజు, మూర్తి, పండు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.