ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 టీచర్‌ పోస్టులు

టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్లు, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 8000 టీచర్ జాబ్స్ ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టింది.

దేశ వ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచే ప్రారంభమైన ధరఖాస్తుల తుది గడువు అక్టోబర్ 20వ తేదీతో ముగియనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తామని వెల్లడించింది. అయితే ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని సంబంధిత పాఠశాలలు వెల్లడిస్తాయని తెలిపింది. దేశంలోని 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ (ఏపీఎస్‌)లో వీరిని నియమిస్తామని ప్రకటించింది.

మొత్తం పోస్టులు: 8000

అర్హతలు: పీజీటీకి బీఈడీతోపాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, టీజీటీ పోస్టులకు బీఈడీతోపాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, పీఆర్‌టీ పోస్టులకు బీఈడీ లేదా రెండేండ్ల డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాల. అభ్యర్థులు 40 ఏండ్లలోపువారై ఉండాలి. అనుభవం ఉన్నవారికైతే 57 ఏండ్ల వయస్సు ఉండాలి. స్క్రీనింగ్‌ టెస్టుకు సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌ ఎవాల్యుయేషన్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

అప్లికేషన్‌ ఫీజు: రూ.500

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 1

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 20

అడ్మిట్‌ కార్డులు: నవంబర్‌ మొదటి వారంలో

పరీక్ష తేదీ: నవంబర్‌ 21, 22

ఫలితాల విడుదల: డిసెంబర్‌ మొదటి వారంలో

వెబ్‌సైట్‌: http://aps-csb.in