పోలవరంలో జనం కోసం జనసేన 87వ రోజు

పోలవరం నియోజకవర్గం: పోలవరం మండలం, ప్రగడపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు గునపర్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం జనంలోకి జనసేన 87వ రోజు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి బాలరాజు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం పేదల పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ, జనసేన మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి వివరిస్తూ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే చేసేటువంటి గొప్ప గొప్ప పనులను, పథకాలను వివరించడం జరిగింది. గ్రామస్తులు చిర్రి బాలరాజు గారితో గ్రామంలోని అతి ముఖ్యమైన సమస్య వారికి ఇల్లు లేకపోవడం అని, ఎమ్మెల్యే కనీసం మా గ్రామానికి వచ్చి మా సమస్యలు అడిగిన రోజులు లేవని, మా సమస్యలపై దరఖాస్తు పెట్టుకుంటే కనీసం పట్టించుకోని అధికారులు లేరని, జగనన్న ఇల్లును చెప్పి ఇల్లు ఇస్తామని ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఈ ఎలక్షన్లో ప్రభుత్వానికి మేమే బుద్ధి చెప్తామని, ఈసారి ఇక్కడ చిర్రి బాలరాజు గారు ఎమ్మెల్యేగా పైన పవన్ కళ్యాణ్ గారి సీఎంగా చేసి రాక్షసుల పాలన నుండి విముక్తి పొందె విధంగా మేము ముందడుగు వేస్తామని గ్రామస్తులు తెలియజేశారు. ప్రజా సమస్యలు మేము వింటున్నామని ఖచ్చితంగా అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క సమస్యను తీరుస్తామని, పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న, ఆడవారికి భద్రత కల్పించాలన్న, రైతులు గిట్టుబాటు ధర దక్కాలన్నా గ్రామ, మండల, నియోజకవర్గ అభివృద్ధి మీరిచ్చే అవకాశం తోనే సాధ్యమన్నారు, మీకుతోడుగా మేముంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, నాగేంద్ర, నాగు, ఏ. వి, సామియెల్, సీతయ్య, నర్సింహామూర్తి, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.