కాపు సంక్షేమ సేన నూతన కార్యవర్గ ప్రకటన

గాజువాక, కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో అయ్యప్ప అప్పారావు సన్మాన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కాపు సంక్షేమ సేన నూతన కార్యవర్గం ప్రకటించింది. అందులో భాగంగా గాజువాక 87వ వార్డు వడ్లపూడి గ్రామానికి చెందిన కర్రి రత్నంను మహిళావార్డు అధ్యక్షురాలుగా ప్రకటించారు. కాపు సంక్షేమ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు జనసేన నాయకురాలు కరణం నూకరత్నం కళావతి ఆవిడ చేతుల మీదుగా పదవి బాధ్యతలు అందజేసారు. ఈ సందర్భంగా రత్నంని ప్రశంసిస్తూ హార్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు గుర్రాల శ్రీనివాసరావు, కొండేటి భాస్కర్, పోలిశెట్టి సూర్యప్రకాష్, సుబ్బు విశ్వనాథం మరియు భార్గవ్ వంశీ పాల్గొన్నారు.