సర్వేపల్లిలో జనం కోసం జనసేన 21వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: పొదలకూరు మండలం నందు అదివారం జనం కోసం జనసేన 21వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఆయన సొంత మండలమైన పొదలకూరు పంచాయతీలో కనీసం అభివృద్ధి లేదు. ఆయన చూస్తే సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసానని చెప్పుకుంటున్నాడు. కానీ పొదలకూరు మండల కేంద్రం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల 22 గ్రామాల ప్రజలు ఎప్పుడూ కూడా రాకపోకలు జరిగేటటువంటి పరిస్థితి. అయితే పొదలకూరులోని పాత బస్టాండ్ కి ఆనుకొని ఉన్న కొత్త కాలువ కట్టించండి, కాలువని క్లీన్ చేయండి అని చెప్పి, పందులను నివారించండని ఎన్నోసార్లు నిరసన తెలియజేశారు.. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, మంత్రి గాని ఎవరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ చూస్తే పందులు చనిపోయి దుర్వాసనతో ప్రజలు అల్లాడిపోతున్నా గాని, కనీసం పట్టించుకున్న నాధుడు లేడు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లీచింగ్ చల్లించాము. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించండి 117 పంచాయతీల్లో ఒక పంచాయతీ అభ్యర్థి జనసేన పార్టీ గెలవకపోయినా, ఒక వార్డు మెంబర్ గెలవకపోయినా ప్రజల కోసం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమస్య ఉన్న ప్రతి దగ్గర ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వెళ్లే పార్టీ జనసేన పార్టీ. సామాన్యుల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒకటే అడుగుతున్నాం. ఇప్పటివరకు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు.. ఒక అవకాశం మాకు కల్పించండి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తాం. అలా చేయలేని పక్షంలో రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాటిస్తున్నా, అదేవిధంగా పంచాయతీలకి నిధులు వస్తున్నాయి కానీ, తిరిగి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతున్నాయి. దీంతో పంచాయతీలలో అభివృద్ధి లేదు. పంచాయతీలలో నిధులు లేవు. పంచాయతీ ప్రెసిడెంట్ లందరూ కూడా చెక్క బొమ్మల్లాగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. అందరూ కూడా మనస్పూర్తిగా జనసేనకి ఒక అవకాశం కల్పించండి, మీకు అండగా ఉంటుంది జనసేన పార్టీ. ఈ కార్యక్రమంలో స్థానికులు సంజు రాకేష్, ఖజా, శ్రీహరి, వంశీ, ప్రసాద్, పవన్, మనోజ్, ప్రశాంత్, రత్నం, చౌడేశ్వరి, జాన్, ప్రసాద్, కృష్ణ,హరి, తదితరులు పాల్గొన్నారు.