జమ్మాధిపేట జనసేన యువతకు క్రికెట్ కిట్ అందజేసిన రాయపురెడ్డి

మాడుగుల నియోజకవర్గం: మాడుగుల మండలం, జమ్మదపేట గ్రామానికి చెందిన జనసేన యువతకు మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ క్రికెట్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీకి ఎన్నో విధాలుగా అండదండలుగా ఉన్న యువతను ప్రోత్సహించే విధంగా ఈ యొక్క క్రీడా పరికరాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటికే పలు పంచాయతీల్లో క్రికెట్ పరికరాలు, వాలీబాల్ పరికరాలు ఎంతోమంది యువతకి అందించినందుకు జనసైనికులు రాయపరెడ్డి కృష్ణ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.