గ్రామ సిబ్బందికి వేతనాలు పెంచాలి

  • ముదిగొండ మండల జనసేన పార్టీ మండల కమిటీ డిమాండ్

ఖమ్మం నియోజకవర్గం: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రాము తాళ్ళూరి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు దుంపటి శీను సూచన, సలహాలతో ముదిగొండ మండల గ్రామాల పంచాయతీ సిబ్బందికి ముదిగొండ మండల నాయకులు జొన్నలగడ్డ కుటుంబరావు, ముదిగొండ మండల నాయకులు మిట్టపల్లి రామారావు, జనసేన పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరు డేవిడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మండల నాయకులు కుటుంబరావు, మిట్టపల్లి రామారావు, జనసేన పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలుఇవ్వాలని పి.ఆర్.సిలో నిర్ణయించిన మినిమం బేసిక్ ను 19,000 రూపాయల వేతనంగా చెల్లించాలని, ఆ లోపు జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15,600, రూపాయలు పంపు ఆపరేటర్లు ఎలక్ట్రిషన్లకు డ్రైవర్లులకు కారోబార్ బిల్ కలెక్టర్లకు 19,500 నిర్ణయించాలి, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులను నియమించాలి, జీవో నెంబర్ 51ను సవరించాలి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి, పాత క్యాటగిరి అన్నిటిని అదేవిధంగా కొనసాగించాలి, ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి పది లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలి దీని అమలు, పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా చెల్లించాలి, ప్రమాదంలో మరణించిన కార్మికుని దహన సంవత్సరాలకు 30000 రూపాయలు ఆర్థిక సాయం, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం, ఇన్సూరెన్స్ పథకాన్ని ఐదు లక్షలకు పెంచాలి, ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి, వారాంతపు సెలవులు పండగ సెలవులు జాతీయ అర్జిత సెలవులు దినాలను అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కొడులన్ రద్దు చేయాలని తమ డిమాండ్లను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల నాయకులు నాన్న బాల సంతోష్, ఉప్పు శ్రీను, చింతకాని మండల నాయకులు అనుబోతు వినోద్, షేక్ జానీ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.