పలువురిని పరామర్శించిన పోతిన

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: జనసేన విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్, 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష గురువారం 42 డివిజన్ నందు పలువురిని పరామర్శించారు. ముందుగా ప్రియదర్శిని కాలనీకి చెందిన అందే కిషోర్ కి తుంటు విరిగి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోతిన మహేష్ వారిని పరామర్శించి, వారికి కుటుంబ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలను తిరుపతి సురేష్, అనూష, పోతిన మహేష్ చేతుల మీదుగా అందజేసినారు. అనంతరం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జనసేన కార్యకర్త తండ్రి గుంటూరు జార్జ్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, అశోక్, అల్లాబక్షు, ఇర్పన్, మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.