ఘనంగా కోళ్ళ బాబి జన్మదిన వేడుకలు

రాజోలు నియోజకవర్గం, రాజోలు జనసేన నాయకులు కోళ్ల బాబి పుట్టినరోజు సందర్భంగా రాజోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాగుల్లంక గ్రామంలో గ్రేస్ కమ్యూనిటీ హాల్ వృద్ధాశ్రమమునందు వృద్ధులకు భోజన సదుపాయము, దుప్పట్లు మరియు ఫ్రూట్స్ పంపిణీతో పాటు కేక్ కటింగ్ చేసి కోళ్ల బాబి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలికిపురం మండలం జనసేన పార్టీ ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము మరియు బొంతు రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ, సేవానిరతి కలిగిన నాయకుడితో జనసేన పార్టీ కోసం కష్టపడే యుతకు సమాజంలో మంచిగుర్తింపు వస్తుందని తెలియజేసారు. మలికిపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, రాజోలు ఎంపీటీసీ దార్ల కుమారిలక్ష్మి, రాజోలు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, ఉలిశెట్టి అన్నపూర్ణ, విప్పర్తి సాయిబాబా, మేకల ఏసుబాబు, కటికిరెడ్డి బుజ్జి, తుమ్మలపల్లి నారాయణ, రేఖపల్లి శ్రీను, సాధనాల వెంకన్న బాబు, నక్క బుజ్జి, మల్లిపూడి ప్రసూఫ్, బస్వంత్, చిక్కాల శ్రీను, మహేష్ బాబు, దినేష్, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగినది.