మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి: కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి, వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృత్యువాత పడడం జరిగింది. ఫలితంగా పసిపాప అనాథగా మిగిలిన విఘాతగాథ చోటు చేసుకుంది. బాలింత మృతికి కారకులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం కదిరి శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపప్పూరు మండలం పసలూరు గ్రామానికి చెందిన బాలింత జ్యోతి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందని అన్నారు. గర్భవతి జ్యోతి ఈనెల 18వ తేదీన తాడపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ ఉన్న వైద్యులు గత రెండు రోజులు వైద్యం అందించిన తర్వాత కడుపులో బిడ్డకు అనారోగ్యంగా ఉందని అత్యవసరంగా అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని తెలిపారు. దీంతో గర్భవతి జ్యోతిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ వైద్యులు ఎమర్జెన్సీగా గర్భవతి జ్యోతికి సిజేరియన్ చేశారు. జ్యోతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ తల్లికి అనారోగ్యంగా ఉందని వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించాలని వైద్యులు తెలిపారు. దీనితో బంధువులు హుటా హుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్యం అందిస్తున్న సమయంలో బాలింత జ్యోతి మృతి చెందినట్లు తెలిపారు. ముఖ్యంగా తాడిపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఇంత సమయం వృధా కావడం వల్లే బాలింత జ్యోతి మృతి చెందిందని తెలిపారు. వైద్యులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం ఏమిటి అని ప్రశ్నించారు. బాలింత జ్యోతి మరణంతో తల్లి లేని బిడ్డగా మిగిలిపోవడం చాలా బాధాకరం అన్నారు. కావున ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మృతురాలి బిడ్డను వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బాలింత జ్యోతి తండ్రి కన్నీరు మున్నీరవుతూ ప్రజా ప్రతినిధులు జ్యోతి బిడ్డ ఆదుకోవాలని కోరారు.