క్రీస్తు సంఘం ఆలయ ప్రతిష్టలో పాలుపంచుకున్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ సొంత స్వగ్రామమైన కందరాడ గ్రామంలో క్రీస్తు సంఘం చర్చి నిర్మాణం నిమిత్తం స్లాబ్ కొరకు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ 100 బస్తాలు సిమెంట్ అందించారు. బుధవారం నూతన క్రీస్తు సంఘం ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా స్థానిక దైవజనులు ఎమ్ ఏసుదాసు మరియు సంఘ సభ్యులు యూత్ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అనంతరం స్థానిక దైవజనులు ఎమ్ ఏసుదాసు మరియు సంఘ పెద్దలు కలిసి జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక దైవజనులు ఎమ్ ఏసుదాసు, బండి చందర్రావు, మాస సోమరాజు, బొండాడ జయరాజు, కన్నబాత్తుల చంటిబాబు, మోటుకుల రాజేష్, పల్లేటి మణిరాజు, బండి రాజు, మాట్టాడ నూకరాజు, మసా శేషారావు, పల్లెటి జ్యోతి బాబు, మరియు జనసైనికులు సంఘ పెద్దలు పాల్గొనడం జరిగింది.