అనంతపురం ఉమ్మడి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

  • తక్షణమే నష్టపోయిన ప్రతి రైతుకు, పంట పెట్టిన పంటల వారిగా నష్ట పరిహారం అందించాలి
  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: రైతులకు మద్దతుగా నిర్వహించిన సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో శనివారం జనసేన పార్టీ తరఫున అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ద్రోహి.. జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం విపత్తులతో ఏదో ఒక విధంగా నష్టపోతున్న రైతులని గాలికి వదిలేసింది, కేవలం ప్రకటనలు చేసుకుంటూ గొప్పలు చెప్పుతూ, మాయమాటలుతో రైతులని మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుతున్నారు. గత రెండేళ్లుగా అతివృష్టి, ఈ సంవత్సరం ఎలినో ప్రభావం వల్ల అనావృష్టి. ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చిత్తశుద్ధితో రైతులని ఆదుకోవాలి. రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కేవలం ప్రతిపక్షాలను నిందించడం తప్ప రైతు పక్షాన మాట్లాడిన పాపాను పోలేదు, ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా చిత్తశుద్ధితో రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.