అశ్వరావుపేటలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసైనికులకు 5 లక్షల రూపాయల భీమా పథకం మరియు క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ ఈ కిట్లలో కార్యకర్తలకు ఐడి కార్డు, ఆ ఐడి కార్డు ఉన్న నెంబరు ఇన్సూరెన్స్ భీమా నెంబర్ అని మరియు మన జనసేన పార్టీ ఎలక్షన్స్ సింబల్ గాజు గ్లాస్, రాసుకోవడానికి నోట్ బుక్, పవన్ కళ్యాణ్ మనోగతం బుక్ అందించారని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పెట్టినటువంటి మీటింగ్స్ కానీ, ర్యాలీలలో పాల్గొనే కార్యకర్తలకు గాని జనసైనికులకు గాని ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయినా, ప్రమాదవశాత్తు మరణించినా ఆయన నిరాశ నిస్సృహలకు లోనై మన గురించి ఆలోచించి ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం అనే భీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉదాహరణకి ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన ముదిగొండ సాగర్ అనే మన జనసేన పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు సాగర్ మరణం జనసేన పార్టీకి తీరని లోటు అని, వారి తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు ఎవరు తీర్చలేని ఆవేదన అని అన్నారు. ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఈ భీమా పథకం వారి కుటుంబానికి ఎంతో కొంత అండగా ఉంటుందని, సాగర్ క్రియాశీలక సభ్యత్వ భీమా పథకం 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు జనసేన పార్టీ ఆఫీస్ కి వచ్చిందని త్వరలో కళ్యాణ్ గానీ రాష్ట్ర నాయకులు గానీ వారి చేతులు మీదుగా ఆ కుటుంబానికి అందజేస్తారని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క జన సైనికులు కార్యకర్తలు వీర మహిళలు కచ్చితంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని తెలియజేశారు. మరియు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అశ్వరావుపేట నియోజకవర్గంలో మన నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్యే క్యాండెట్ ని పెట్టబోతున్నారు కావున అశ్వరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతంగా పనిచేసి మన జనసేన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యేని గెలిపించి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా అందించాలని అలాగే స్థానిక ఎలక్షన్లో ములకలపల్లి మండలంలో పార్టీలో బలంగా పనిచేసి ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా నిలబడి గెలిచి జనసేన పార్టీ సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గరికే రాంబాబు, ములకలపల్లి మండల ఉపాధ్యక్షులు కందుకూరి వినీత్, మండల నాయకులు బొక్క వెంకటేశ్వర్లు, బాదావత్ రవికుమార్, బోడ నాగరాజు నాయక్, నక్కన రమేష్ కొండ్రు నాగేంద్రబాబు కుంజ పాపారావు, కార్యకర్తలు బోలగాని సురేష్, కొండ్రు అంజన్ రావు, బోలగా నవీన్, మానితాల శివప్రసాద్, యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.