పాలచర్లలో వైసిపి క్లీన్ బౌల్డ్- జనసేన విన్

  • నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ పైన రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పాలచర్ల గ్రామంలో.. వైసీపీ ప్రభుత్వం తీరుకు విసుగు చెంది ఎస్సీ మరియు బీసీ కులాలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, యువత గ్రామస్తులు, జనసేన పార్టీ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ మరియు వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో 00 మంది చేరిక. రాబోయే రోజుల్లో రాజానగరంలో 50 వేల ఓట్ల మెజార్టీతో జనసేన జెండా ఎగురు వేస్తామని ధీమా వ్యక్తపరిచిన పాలచర్ల గ్రామస్తులు. ఈ సందర్భంగా పాలచర్ల గ్రామస్తులు మాట్లాడుతూ… రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ దంపతులు చేసే సేవా కార్యక్రమాలు నచ్చి.. ఎవరికి ఏ ఆపద వచ్చినా మా దంపతులు మీకు మేము అండగా ఉంటామని చెబుతూ.. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని బలపరుస్తూ.. రాజానగరాన్ని సేవా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోనే ముందంజలో తీసుకెళుతూ.. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన గెలుపుని గిఫ్టుగా ఇస్తామని.. ధీమా వ్యక్తపరిచిన బత్తుల దంపతులకు మేమందరం వెంటే ఉంటాము అంటూ నినాదాలు చేస్తూ రాజానగరంలో బత్తుల ఫ్యామిలీని ఎమ్మెల్యేగా గెలిపించి.. అసెంబ్లీకి పంపించే వరకు.. పాలచర్ల గ్రామం నుంచి వెనుదండుగా ఉంటామని గ్రామస్తులందరూ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.