వెల్తూరి నగేష్ జనసేనలో చేరికలు

తెలంగాణ, పాలకుర్తి, జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని తొరూరు పట్టణంలో 20 మంది యువకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శుక్రవారం జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వెల్తూరి నగేష్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా అహ్వానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ,పార్టీని బలంగా ప్రజలలోనికి తీసుకెళ్ళాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.