షాజహాన్ బాషాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

మదనపల్లి, జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించబడిన మదనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషాని మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో అలాగే నా సేనకు నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్ మరియు మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు షాజహాన్ బాషాని మర్యాదపూర్వకంగా జనసేన పార్టీ కార్యాలయానికి ఆహ్వానించి వారిని వారి పరివారాన్ని శాలువాలతో సత్కరించి షాజహాన్ బాషాకి పుష్పగుచ్చం అందచేసి మదనపల్లి జనసేన పార్టీ తరఫున వారికి సంపూర్ణ మద్దతు ప్రతి ఒక్కరు ఇస్తామని ముక్తకంఠంతో తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ మదనపల్లి జిల్లా కావడానికి తను ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, కచ్చితంగా ప్రభుత్వం రాగానే ఈ యొక్క మదనపల్లి జిల్లా విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా చేయాలని ఈ సందర్భంగా కోరారు అలాగే శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ కచ్చితంగా షాజహాన్ బాషాకి తన తరఫున సంపూర్ణ మద్దతు ఉంటాదని తెలియజేశారు. ఈ సందర్భంగా ‌మదనపల్లి ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ కచ్చితంగా మదనపల్లి జిల్లా చేసేలాగా తను మదనపల్లి నియోజకవర్గం ప్రజల తరపున పోరాటం చేసి మదనపల్లి జిల్లా సాదిస్తామని మదనపల్లిని తన ఇంటిగా భావించి తన వంతు సహాయ సహకారాలు అందించి తను ఎమ్మెల్యే కాగానే మదనపల్లిలో ఉన్న ప్రజల ప్రతి ఒక్క సమస్యను తీర్చడమే తన లక్ష్యంగా పనిచేస్తానని అందరికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు మల్లికా, రూప, రేఖ, మంజుల, సరోజమ్మ, భూదేవి, నందిని, శివమ్మ, సరస్వతి, రమణమ్మ, వెంకట, రమణమ్మ ,సుబ్బమ్మ, జనసేన నాయకులు చంద్రశేఖర్, కుప్పాల శంకర్, అశ్వత్, శ్రీనాథ్, సిద్దయ్య, శ్రీనివాసులు శంకర్, అశోక్, గంగాధర్, శీన, పతి, మల్లికార్జున, సుప్రీం హర్ష, జనసేన సోను, యాసీన్, పవన్, చంద్ర, యోగి బాబు, వసంత్, సత్య, నవాజ్, అభినవ్, రియాన్, గోపాల్, గురు రాయల్, వినయ్, బాలు, కిరణ్, సాయి, భాను, సందీప్, నవీన్, కౌశిక్, రమేష్, కిరణ్, చిన్న రెడ్డి, గణేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.