ఏలూరులో అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘననివాళి

ఏలూరు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వంపై జనసేన పార్టీ పోరాడుతుందని మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో వసంత మహల్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీవీ రాఘవయ్య చౌదరి, సిరిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం తెలుగువారందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములును స్మరించుకుంటూ రాష్ట్రంలో అరాచక పాలన అంతానికి పోరాడుతామని స్పష్టం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి సాధించి అమరులైన పొట్టి శ్రీరాములు పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని అరాచక జగన్ ప్రభుత్వాన్ని 100 రోజుల్లో ఇంటికి పంపిస్తామన్నారు. కుటిల రాజకీయ ఆలోచనతో సీఎం జగన్ విధ్వంసాలకు పాల్పడుతున్నారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, నాయకులు నూకల సాయి ప్రసాద్, బొత్స మధు, బుద్ధ నాగేశ్వరావు, చిత్తిరి శివ, సోంబాబు, గూడవల్లి నవీన్, కె పవన్, స్వామి, జగదీష్, అరవింద్, చైతన్య, సురేష్ తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి అర్పించారు. అనంతరం హలో ఎపి… బై బై వైసీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.