నాలుగున్నర ఏళ్ల పాలనలో గోతులు కప్పుకోలేకపోయారు!

  • తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?

పార్వతీపురం: చెత్త డంపింగ్ యార్డ్, రాయగడ రోడ్డులో గోతులు వద్ద జనసేన పార్టీ నాయకులు నిరసన తెలియజేసారు. వైసిపి నాలుగున్నర ఏళ్ల పాలనలో కనీసం రోడ్లల్లో ఏర్పడిన గోతులను కప్పుకోలేకపోయారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం ఆ పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, తామరఖండి తేజ, పసుపురెడ్డి పూర్ణచంద్ర ప్రసాద్ వి. సత్యనారాయణ తదితరులు పార్వతీపురం రాయగడ రోడ్డులో ఏర్పడిన పెద్దపెద్ద గోతులను, మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిలో ఉన్న గోతుల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గత రెండు రోజులుగా రోడ్డు గోతుల వద్ద నిరసనలు తెలియజేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయగడ రోడ్డు లో ఉన్న గోతులతోపాటు డంపింగ్ యార్డ్ వద్ద ఏర్పడిన గోతుల్లో పలువురు వాహనచోదకులు ప్రమాద బారిన పడ్డారన్నారు. తరచూ ఈ ప్రాంతంలోని గోతులు వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ సంబంధిత పాలకుల్లో, అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు వైసీపీ నాలుగున్నర ఏళ్ల పాలనలో కనీసం రోడ్లు గోతులు పూడ్చలేని దుస్థితిలో పాలన చేసిందన్నారు కాబట్టి ప్రజలు వైసిపి చేస్తున్న అస్తవ్యస్త పాలనను గమనించాలన్నారు. రోడ్లు గోతులు పూడ్చలేని చేతకాని ప్రభుత్వం ప్రజా పాలన ఏవిధంగా చేస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. మౌలిక సదుపాయాలలో ఒకటైన రోడ్డు సదుపాయం కల్పించలేకపోయారన్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర ఒడిస్సా రహదారి పరిస్థితి దారుణమన్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు కళ్ళు తెరచి ఆయా రోడ్డులో ఏర్పడిన గోతులను పూడ్చి ప్రమాదాలను నివారించాలన్నారు.