అంబేద్కర్ కు మలిశెట్టి వెంకట రమణ ఘన నివాళులు

  • రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట: అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా రాజంపేట పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ని ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలని కోరడం జరిగింది. దళితులను కాపాడడానికి అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తెస్తే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈరోజు అదే చట్టాన్ని దళితులను ఉపయోగించుకొని అక్రమంగా సామాన్య కుటుంబాల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, చివరికి ప్రజల మీద కూడా అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులను అంతమొందించి డోర్ డెలివరీ చేసే స్థాయికి వైకాపా నాయకులు కార్యకర్తలు ఎదిగారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి జగన్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తోంది. ప్రజలకు స్వేచ్చలేదు, వాక్ స్వాతంత్రం లేదు. మాట్లాడితే స్టేషన్లకు ప్రజలను తరలిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఈరోజు రౌడీలు, గుండాలు రాజ్యమేలుతూ ఉన్నారని వెంకటరమణ పేర్కొన్నారు.