ఫ్యాషన్ బోటిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రం నుండి రాయచోటి వెళ్ళే రోడ్డుపై పార్లపల్లి శ్రీమతి నందిని (సిద్దమ్మ) శ్రీ వెంకటరమణ 2వ కుమారుడు శివ నూతన టైలర్ షాప్ ప్రారంభోత్సవంలో వారి ఆహ్వానం మేరకు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల నలు వైపులా నుంచి ప్రజలందరూ మండల కేంద్రంలో అందుబాటులో ఉన్నటువంటి ఫ్యాషన్స్ బొటెక్ షాప్ ను అవసరమైన వారందరూ ముఖ్యంగా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలానే నిరుద్యోగ యువత అందరూ పార్లపల్లి శివ లాంటి యువకుడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వివిధ రకాల వృత్తిలో తమ వంతు స్వయం కృషి చేయాలని ఇటువంటి చేతి వృత్తుల ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలాలని అదేవిధంగా దానితో పాటు 10 మందికి ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మాజీ మొదటి సుండుపల్లి ఎంపీటీసీ నంద్యాల రామయ్య, మాజీ సుండుపల్లి గ్రామ అధ్యక్షుడు చెన్నంశెట్టి వెంకటరమణ, మాజీ వార్డు మెంబర్ జగిలి సిద్దు, పెద్దబ్బ మరియు గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్థులు, బంధుమిత్రులు తదితరులు హాజరయ్యారు.