కొల్లగుంటలో జనంకోసం జనసేన

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కొల్లాగుంట గ్రామపంచాయతీలో జనంకోసం జనసేన కార్యక్రమం(భవిష్యత్తు గ్యారెంటీ) జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్.యుగంధర్ పొన్న హాజరయ్యారు. కొల్లాగుంట, కొల్లాగుంట ఏఏ డబ్ల్యూ గ్రామంలో ఇంటింటికి వీల్ చైర్లోనే వెళుతూ కరపత్రాలు అందించారు. ఒకసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని, పార్టీ సిద్ధాంతాలను తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ అధికారులు జెండా ఎగరేస్తే అది ఆనవాయితీ, ప్రజలు జెండా ఎగరేస్తే అది పండగ, ప్రజలే జండా ఎగరేసే రోజు రావాలని, అది జనసేనకే సాధ్యమని తెలిపారు. కొల్లగుంట గ్రామంలో చక్కని మురుగునీటి వ్యవస్థ లేదని, మంచి సిమెంట్ రోడ్లు లేవని, అలాగే కొల్లాగుంట ఏ ఏ డబ్ల్యూ గ్రామంలో, ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిల్వ ఉండి దోమలమయమైందని, మౌళిక వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ఏర్పడే జనసేన సరికొత్త ప్రజా ప్రభుత్వంలో మౌళిక వసతులు కల్పించి, గ్రామాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని, వారికి కొత్త ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలాగే మౌలిక వసతులు లేకుండా పోతే చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు అనారోగ్యం కాక తప్పదని తెలియజేశారు. నియోజకవర్గంలో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ,జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటినగరం మండల కార్యదర్శి మురళి, నియోజకవర్గ కార్యదర్శులు అన్నామలై, కోదండ,, మండల కార్యదర్శి హరీష్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, పాలసముద్రం మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్, జనసైనికులు పాల్గొన్నారు.