భారత రాజ్యాంగాన్ని అనుసరించాలన్న జగన్ బిసాయి

ఇచ్చాపురం, కులదృవీకరణ పత్రాల సమస్య వెంటనే పరిష్కరించాలని బెంతో ఒరియా గిరిజనులు కొనసాగిస్తున్న నిరాహార దీక్ష 36వ రోజుకు చేరుకుంది. దీక్షలో పెద్ద బల్లిపుట్టుగ గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులపెద్ద జగన్ బిసాయి మాట్లాడుతూ భారత దేశానికి 1947లో బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం లభించినప్పటికీ 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి అచ్చిందని గుర్తుగా ప్రతీ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరపుకుంటున్నామని అప్పట్లో క్రీస్తు పూర్వం నుంచి వివిధ కులాలుగా గుర్తింపు ఉన్నప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం బెంతో ఒరియా గిరిజనుల జీవన స్థితిగతులను గుర్తింపబడి ఉందని అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత కూడా వివిధ సామాజిక వర్గ కులాలను వివిధ ఓసీ, బీసీ, యస్టీ, యస్సిలుగా తదితర పొందుపరచినప్పుడు ఇప్పుడు అందులో ఏ ఒక్క కులాలను జన్మ హక్కును ఈ కులం కాదు అని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరికీ లేదని రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. పూర్వం నుంచి బెంతో ఒరియా గిరిజనులుగా 2003 వరకు యస్టీలుగా కులదృవీకరణ పొంది ఉన్నాము. కానీ రాజకీయ లబ్ది శ్వతువ్వేసంతో ఇచ్ఛాపురంలో గల బెంతో ఒరియా సామాజిక వర్గంని అణచి వేయడానికి పన్నిన కుట్రలో ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్ బిసాయి, దుదిస్టి మజ్జి, జయసేన్ బిసాయి, మనోహర్ దలై, కృష్ణ దలై తదితరులు పాల్గొన్నారు.