పల్నాడు పర్యటనలో గాదె వెంకటేశ్వరరావు

మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి గారు ఇరువురు, మొదట ధర్మవరం గ్రామంలో జనసెన పార్టీ జెండా అశేష జన సందోహంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి, అనంతరం దుర్గి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంగాపురం తండాలోని గ్రామంలో జండా ఆవిష్కరణ చేసుకొని తదుపరి కంచరగుంట గ్రామంలో భారీ జన సందోహం సమక్షంలో బహిరంగ సభలో ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా కంచరగుంట గ్రామంలోని సుమారు 50 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది వారికి జిల్లా అధ్యక్షులు గాదె గారు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండల అధ్యక్షులు తోటకూర శ్రీనివాసరావు, వెల్దుర్తి మండల అధ్యక్షులు గంధం మల్లయ్య, రెంటచింతల మండల అధ్యక్షులు అంబటి నరసింహారావు, మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి పులి హారి అధికార ప్రతినిధి నక్షత్రపు ప్రసాద్ వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీనివాస్ రాయల్, గురజాల నియోజకవర్గంలోని జిల్లా కార్యదర్శి అంబటి మల్లీ, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిసెట్టీ రమేష్, దాచేపల్లి మండల అధ్యక్షులు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.