ప్ర‌త్తిపాటి గెలుపుతోనే నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌గ్రాభివృద్ది: పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌, త‌ప్పులు తాను చేస్తూ వాటిని ప్ర‌తిష‌క్షాల‌కు ఆపాదించాల‌ని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అవ్వాతాత‌ల‌ను ఇబ్బంది పెట్టి ఇదంతా ప్ర‌తిప‌క్షాల కుట్ర అని ఆరోపించ‌టం దొంగే దొంగా.. దొంగా అని అరిచిన‌ట్లు ఉందని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. గురువారం త‌న కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ వ‌లంట‌ర్ల‌ను పింఛ‌న్ పంప‌ణీ నుంచి తొల‌గించాక ప్ర‌త్యామ్న‌య మార్గాలు అన్వేషించి ఇంటివ‌ద్ద‌నే పింఛ‌న్ అంద‌జేయాల్సిన త‌రుణంలో దీన్ని కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వాడుకోవ‌డం జ‌గ‌న్‌కే చెల్లింద‌న్నారు.

  • జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో రాక్షస క్రీడ‌
    ఎన్నికల కమిషన్, వాలంటీర్లను పింఛన్ల పంపిణీకు దూరంగా ఉంచాలని నిబంధన విధిస్తే దాన్ని రాజకీయం చేశారని, మూడు రోజులైనా పింఛన్ల డబ్బులు పంపించకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అవ్వా తాతలతో పాటు అభాగ్యులైన దివ్యాంగులను కూడా రోడ్లపైకి రప్పించి తన రాక్షస క్రీడ మొదలుపెట్టాడని ఆరోపించారు. టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు జ‌గ‌న్, జ‌గ‌న్ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియాలో చేస్తున్న ప్ర‌చారాల‌ను ఖండించాల‌ని పిలుపు నిచ్చారు.
  • ఓటేస్తే గుంటూరు పారిపోయారు
    ఓట్లు వేసిన పాపానికి చిల‌క‌లూరిపేట ప్ర‌జ‌ల‌ను ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి విడుద‌ల ర‌జిని నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలివేసి గుంటూరుకు పారిపోయార‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాలు కూడా తీర్చ‌కుండా గుంటూరు ప్ర‌జ‌ల‌ను ఉద్ద‌రిస్తామ‌ని హామీలు ఇస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ది కుదేలైంద‌ని, చేసిన ప‌నుల‌కు కూడా బిల్లులు చెల్లించ‌లేని దుస్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. ఐదేళ్ల కాలంలో చిల‌క‌లూరిపేట‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లు మ‌రింత అధ్వాన్నంగా త‌యార‌య్యాయ‌ని ఆరోపించారు.
  • ప్ర‌త్తిపాటి గెలుపుతోనే నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌గ్రాభివృద్ది
    ఉమ్మ‌డి కూట‌మి అభ్య‌ర్ధి ప్ర‌త్తిపాటి పుల్లారావు గెలుపుతో నియోజ‌క‌వ‌ర్గంలో పాత రోజులు తిరిగి రానున్నాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. గ‌తంలో కొన‌సాగిన అభివృద్దిని కొన‌సాగిస్తార‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో సంక్షేమం, అభివృద్ది రెండు క‌ళ్లుగా పాల‌న కొన‌సాగ‌నుంద‌ని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో నానాటికి తాగునీటి స‌మ‌స్య తీవ్ర‌మౌతుంద‌ని, గ్రామీణ ప్రాంతాల్లో పేద‌లు సైతం డ‌బ్బులు చెల్లించి తాగునీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. ప‌ట్ణ‌ణంలో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్ద‌డి తీవ్ర‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చిలకలూరిపేట
    *మున్సిపల్ సానిటరీ వర్కర్లకు వెంటనే జీతాలు ఇవ్వాలి.
    మున్సిపాలిటీలో 272 మంది సానిటరీ వర్కర్లకు పనిచేస్తున్నారు వారికి మూడు నెలల నుంచి జీతాలు ఎందుకు ఇవ్వటం లేదని బాలాజి ప్రశ్నించారు, మున్సిపల్ అధికారులు అదే ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న 80 మందికి మాత్రం జీతాలు ఇచ్చి మిగతా వారికి ఎందుకు ఇవ్వటంలేదు, దీనిపై సత్వరమే అధికారులు స్పందించాలని బాలాజి డిమాండ్ చేసారు.