పెడన బస్టాండా? లేక వైసీపీ కార్యాలయమా?: ఎస్ వి బాబు

  • వైసీపీ నాయకుల బరితెగింపు ఇది ఒక నిదర్శనం.
  • అధికారుల నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునక
  • నిద్ర వ్యవస్థలో ఆర్టీసీ అధికారులు

పెడన నియోజవర్గానికి గత నెలలో ముఖ్యమంత్రి పర్యటన చేయడం జరిగింది. ఆ సందర్భంగా మంత్రి జోగి రమేష్, మరియు వారి అనుచరులు ఫ్లెక్సీ బ్యానర్లను ఓ పద్ధతి పాడు లేకుండా ఎక్కడపడితే అక్కడ కట్టడం జరిగింది. పనిలో పనిగా పెడన ఆర్టీసీ బస్టాండ్ కూడా ఫ్లెక్సీలు కట్టారు. మున్సిపల్ కార్యాలయాం అయితే చెప్పక్కర్లేదు. మున్సిపల్ ఆఫీస్ కనపడనంతగా వైసీపీ బ్యానర్లు కట్టేశారు. జోగి రమేష్ కి బ్యానర్లు పిచ్చి ఎక్కువ. అయితే పిచ్చి పరాకాష్టకు చేరి ప్రభుత్వ ఆస్తులు పైన కూడా పార్టీ బ్యానర్లు కట్టే స్థాయికి పెరిగింది. జనసేన బ్యానర్ కనబడితే చాలు, జోగి రమేష్ కు వణుకు పుడుతుంది. వెంటనే అధికారులకు తెలియజేయడం ఆ బ్యానర్లు తీయించడం జరుగుతుంది. జనసేన బ్యానర్లు తీపించడంలో అత్యుత్సాహం చూపించే అధికారులకు పెడన బస్టాండ్ కి, మున్సిపల్ ఆఫీసులకు కట్టిన వైసీపీ బ్యానర్లు కనపడటం లేదా? కేవలం ఐదు సంవత్సరాలు పదవిలో ఉండే రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు ఎత్తుతూ 60 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో ఉండే అధికారులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నట్టు కాదా? ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అధికారులు, అధికార పార్టీ నాయకులకు వారు చేసే ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు వత్తాసు పలకటం ప్రజాస్వామ్యక స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి బస్టాండ్ పై పెట్టిన వైసీపీ బ్యానర్లను, మున్సిపల్ ఆఫీస్ కట్టిన వైసీపీ బ్యానర్లను వెంటనే తొలగించవలసిందిగా విజ్ఞప్తి. లేని ఎడల ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడవలసివస్తుందని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.