గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 36వ రోజు

పాలకొండ: గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 36వ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం టౌన్ ప్రాంతంకి చెందిన తెలగ వీధిలో జనసేన తరుపున జనసేన జానీ, మత్స పుండరికం, కర్రీ కళ్యాణి, వావిలపల్లి భూషణ్, కర్నెన సాయి పవన్, బొమ్మాళి వినోద్, దూసి ప్రణీత్ పర్యటన చెయ్యడం జరిగింది. ఈ క్రమంలో జనసేన జానీ మాట్లాడుతూ వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గిరిసేన జనం వద్దకు – జనసేన 36వ రోజు కార్యక్రమంలో బాగంగా వీరఘట్టం మండల కేంద్ర పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రతి సమస్య తెలుసుకుని, ప్రజల పక్షాన నిలబడి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. మత్స పుండరికం మాట్లాడుతూ ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అధికారం లేకపోయినా ప్రజలుకి సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు నేరుగా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి వారికి అండగా ఉంటున్నారు. జనసేన పార్టీ వీరమహిళ కర్రి కళ్యాణి మాట్లాడుతూ జనసైనికులు జనసేన నాయుకులకి, వీరమహిళలను ఎన్నో విధాలుగా వైస్సార్సీపీ అధినాయకుడు, మంత్రులు అనరాని మాటలు మాట్లాడినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంతవరకు తగ్గాం ఇకనుంచి ఎవ్వరైనా జనసేన పార్టీ దగ్గర తగ్గాల్సిందే. ఇప్పటంలో ఇళ్లు కూల్చితే వారికి ఒక్కొక్కరికీ లక్ష రూపాయిలు చొప్పున 39 మందికి ఇచ్చిన గొప్ప నాయుకులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి ఐతే ఈ రాష్ట్రము చాలా అభివృద్ధి చెందుతుందని తెలియజేసారు.