ఇంటింటికీ జనసేన-తెలుగుదేశం-బీజేపీ త్రిశూల వ్యూహం

రాజానగరం, రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం గ్రామంలో, ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి మన ఆశలకు, ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించండి అని జనసేన పార్టీ వీరమహిళా కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూషాదేవి, వందనాంబిక అభ్యర్దించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం-బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.