అగ్ని ప్రమాదం పై స్పందించిన హరీష్ రావు

శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం లో తొమ్మిది మంది మ‌ర‌ణించారు. దట్టమైన పొగల కారణంగా ఎంత ప్రయత్నించినా రెస్క్యూ టీమ్ వారిని రక్షించలేకపోయింది. ఇప్పటివరకూ అయిదుగురి మృత దేహాల‌ను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. మరో నలుగురి మృత‌దేహాల‌ను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఘటనపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరం. ప్రమాధంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని’ మంత్రి హరీష్ రావు ట్వీట్