చిటికెలో 10 లక్షల వరకు లోన్..?

కోవిడ్-19 కారణంగా అన్ని రంగాలు సంక్షోభం లో కూరుకుపోయాయి. చిన్నతరహా పరిశ్రమల పరిస్థితి మరీ కష్టంగా  మారిపోయింది. చిన్న తరహా పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి.. కనీసం మనుగడ కూడా ఇబ్బందిగా మారిపోయింది. ఇలాంటి పరిణామాల క్రమంలో రాజోర్ పే చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు ప్రయోజనం కలిగే విధంగా సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది.. తక్షణ రుణ సదుపాయం పొందే అవకాశాన్ని కల్పించింది.

నగదు అడ్వాన్స్ పేరుతో ఈ కొత్త సర్వీస్ ను అందుబాటు లోకి తీసుకువచ్చింది రాజోర్ పే . ఇక రాజోర్ పే తీసుకొచ్చిన ఈ కొత్త సర్వీసుల ద్వారా.. ఎంఎస్ఎంఈ లు 50 వేల నుంచి 10 లక్షల వరకు రుణ సదుపాయాన్ని పొందవచ్చు. అది కూడా సెకన్లలోనే జరిగిపోతూ ఉంటుంది. కేవలం పది సెకన్ల వ్యవధిలోనే ఈ రుణ సదుపాయాన్ని పొందేందుకు అవకాశం కల్పించింది రాజోర్ పే. అయితే ఈ రుణం పొందాలనుకునే వారికి.. క్రెడిట్ హిస్టరీ బాగుండాల్సి ఉంటుంది. గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన ఈఎమ్ఐ లు అన్ని సవ్యంగా ఉండాల్సి ఉంటుంది.

ఒకవేళ గతంలో ఈఎంఐలు చెల్లించడంలో విఫలం అయిన వారికి మాత్రం రాజోర్ పే తీసుకువచ్చిన లోన్ పొందడం కష్టం గా మారే అవకాశం ఉంది. అయితే ఈ సర్వీసు ద్వారా పొందిన రుణాన్ని ఆరు నెలల నుంచి 12 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించేందుకు అవకాశం కల్పిస్తుంది. అయితే ప్రస్తుతం రాజోర్ పే తీసుకువచ్చిన కొత్త రుణ సదుపాయం… చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. కరోనా వైరస్ కారణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన చిన్న తరహా పరిశ్రమలకు ఇది ఒక మంచి అవకాశంగా ఉంది తీరుతుంది.