జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యునిగా గొర్తి

తూర్పుగోదావరి, అమలాపురం పట్టణానికి చెందిన గొర్తి పవన్ ను జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యునిగా నియమించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ క్రియాశీల కార్యకర్తగా పని చేస్తున్నారు. స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాస్ ఈ నియామకం చేపట్టారు. పవన్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.